బ్రేకప్ అయ్యాక హాయిగా ఉందట


Ranbir Kapoor and Kartrina Kaif
Ranbir Kapoor and Kartrina Kaif

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఇక పెళ్లి కావడమే తరువాయి అనుకున్న సమయంలో అనూహ్యంగా అతడితో విడిపోయింది పొడుగు కాళ్ళ సుందరి కత్తిలాంటి కత్రినా కైఫ్ . కొంతకాలం సహజీవనం కూడా చేసిన ఈ జంట పెళ్ళికి ముహూర్తం చూసుకుంది కూడా ఆల్ ఈజ్ వెల్ అనుకున్న సమయంలో ఎక్కడో తేడా కొట్టింది అంతే ! రణ్ బీర్ కపూర్ కు బ్రేకప్ చెప్పింది కత్రినా కైఫ్ . అయితే వీళ్ళు విడిపోయి సంవత్సరం పైనే అయ్యింది కానీ ఇపుడు ఆ సంఘటన ని గుర్తు చేసుకుంటూ బ్రేకప్ చెప్పింది మంచి దైంది అంటూ బ్రేకప్ వల్ల నాకు చాలా మంచి జరిగింది అంటూ పరోక్షంగా రణ్ బీర్ ని తిట్టిపోస్తోంది కత్రినా .

కత్రినా కైఫ్ రణ్ బీర్ కపూర్ ఒక్కడి తో మాత్రమే ఎఫైర్ పెట్టుకోలేదు ఇంకా వరుసలో చాలామంది హీరోలే ఉన్నారు . అలాగే రణ్ బీర్ కపూర్ కూడా తక్కువేమి తినలేదు . తాజాగా అలియా భట్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు . ఈ బంధం గురించి ఇద్దరు కూడా ఓపెన్ అయ్యారు . మరి ఈ బంధం ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి .

English Title :Katrina kaif happy after breakup with Ranbir Kapoor