వివాదానికి ఆజ్యం పోస్తున్న కత్రినా కైఫ్ వ్యాఖ్యలు


కత్తిలాంటి భామ కత్రినా కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది . ఆడవాళ్ళతో సహజీవనం చేయాల్సి వస్తే కరీనా కపూర్ తో నా జీవితాన్ని పంచుకుంటానని , ఆమెతో సౌకర్యవంతంగా ఉంటుందని కామెంట్ చేసి సంచలనం సృష్టించింది . స్వలింగ సంపర్కం అనేది పాశ్చాత్య దేశాల్లో చెల్లుతుంది కానీ సాంప్రదాయాల పుట్టినిల్లు అయిన భారత్ లో మాత్రం అది చెల్లదు .

అయితే ఈమధ్య వచ్చిన చట్టాలు , తీర్పులు స్వలింగ సంపర్కానికి వెన్నుదన్నుగా నిలిచాయి . కానీ తీర్పు వేరు సాంప్రదాయం వేరు అందుకే కత్రినా కైఫ్ వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి . తాజాగా ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన భరత్ అనే చిత్రంలో నటించింది . ఆ సినిమా ఈనెల 5 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసింది . అవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి .