బాయ్ ఫ్రెండ్ లను మార్చేస్తున్న భామ


Katrina Kaif wants new boyfriend
Katrina Kaif

బాయ్ ఫ్రెండ్ లను అవలీలగా మార్చేస్తున్న కత్తి లాంటి కత్రినా కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేసింది . ఇంతకీ ఈ భామ చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా …… గత పది సంవత్సరాలుగా ఒక్క మగాడు కూడా నన్ను డేటింగ్ కి పిలవలేదు అని . నిజంగా ఈ మాటలు విని షాక్ అవ్వడం ఖాయం ఎందుకంటే కత్రినా కైఫ్ అంటేనే రకరకాల ప్రియుళ్ళతో సహవాసం చేసిన భామ అని అందరికీ తెలుసు కానీ నేను ఇంతవరకు డేటింగ్ చేయలేదు అని చెప్పడం గొప్ప సాహసమే మరి .

కెరీర్ ప్రారంభంలోనే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన ఈ భామ దాదాపుగా సల్మాన్ కు అంకితం అయిపొయింది . అయితే ఇద్దరికీ తేడాలు రావడంతో సల్మాన్ ని వదిలేసి రణ్ బీర్ కపూర్ తో డేటింగ్ చేసింది . ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి ,ముహుర్తాలు చట్టబండలు అంటూ నానా యాగీ చేసారు ……. రణ్ బీర్ కపూర్ తో సహజీవనం కూడా చేసింది . ఇక పెళ్లి అన్న సమయంలో మళ్ళీ షరా మాములే ! అదీ బెడిసికొట్టింది దాంతో ముఖేష్ అంబానీ కొడుకు తో కొద్దిరోజులు డేటింగ్ లో ఉంది . కానీ ఇవన్నీ మర్చిపోయి నన్ను ఎవరూ డేటింగ్ కి పిలవడం లేదు అంటూ బాధపడుతోంది . ఓహో ……. ఈ భామ బాధ ఏంటంటే …… ఇప్పుడు ఖాళీగా ఉన్నాను ఎవడైనా పిలవండ్రా అని కాబోలు .

English Title: Katrina Kaif wants new boyfriend