నానిపై పగబట్టిన కౌశల్ ఆర్మీ


kaushal army fires on naniహీరో నానిపై బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ ఆర్మీ పగతో రగిలిపోతోంది అందుకే త్వరలో విడుదల కాబోయే నాని సినిమా దేవదాసు ని ప్లాప్ చేయాలనీ కసిగా ఉంది . కౌశల్ ఆర్మీ ఏంటి ? నానిపై పగబట్టడం ఏంటి ? దేవదాసు ని ప్లాప్ చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? బిగ్ బాస్ 2 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే అయితే ఆ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని అందరి పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదని కొందరి పట్ల అందునా కౌశల్ పట్ల అతిగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహంగా ఉన్నారు . ఒక్క కౌశల్ ఆర్మీ మాత్రమే కాదు మిగతా నెటిజన్లు కూడా నాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

ఈ వ్యవహారం మరీ శృతిమించిపోయి నాగార్జున – నాని నటించిన దేవదాసు మీదకు వస్తుండటంతో ఎట్టకేలకు నాని స్పందించాడు . నాకు ఏ ఒక్కరు శత్రువు కాదు మిగతావాళ్ళెవరూ మిత్రులు కారు , ఎప్పటికప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను …… చేస్తూనే ఉంటాను . మీలో కొంతమంది నన్ను విమర్శించినా మీరంతా నావాళ్ళే ! అంటూ ట్వీట్ చేసాడు నాని .

English Title: kaushal army fires on nani