కౌశల్ మళ్ళీ సీరియల్స్ వైపు.. నెటిజన్స్ ట్రోల్స్కౌశల్ మళ్ళీ సీరియల్స్ వైపు.. నెటిజన్స్ ట్రోల్స్
కౌశల్ మళ్ళీ సీరియల్స్ వైపు.. నెటిజన్స్ ట్రోల్స్

గతేడాది బిగ్ బాస్ సీజన్ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిన పేరు కౌశల్. తన ఆటతీరుతో కన్నా తన ఆటిట్యూడ్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ లో తన ఆటతీరుకి ఫ్యాన్స్ అయ్యాము అంటూ కౌశల్ ఆర్మీ ఒకటి ఫామ్ చేసి దానిపై పెద్ద రచ్చే చేసారు. కౌశల్ ను ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళను ఎలిమినేట్ అయ్యేలా చేయడం, బయట ర్యాలీలు చేయడం ఇలా కౌశల్ పేరు బిగ్ బాస్ నడుస్తున్నంత సేపూ మార్మోగిపోయింది. అయితే కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక కథ మొత్తం మారిపోయింది. ఇది ఒక ఫేక్ ఆర్మీ అంటూ బాబు గోగినేని సహా కొంతమంది వాదించడం, కొన్ని రుజువులు చూపించడం, ఆ తర్వాత కౌశల్ ఆర్మీలో భాగమైన వాళ్ళే కౌశల్ తమను బాధపెట్టాడని, కౌశల్ ఆర్మీ ఫండింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని మీడియా సాక్షిగా వాదించడం ఇవన్నీ హైలైట్ గా నిలిచాయి.

ఇవన్నీ ఒకెత్తు అయితే బిగ్ బాస్ గెలిచిన తర్వాత కౌశల్ చెప్పిన మాటలు చేసిన చేష్టలు మరొకెత్తు. తనకు అత్యధిక ఓట్లు వచ్చినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తనకు స్థానం దక్కుతుందని, ఏదో యూనివర్సిటీ వాళ్ళు తనకు డాక్టరేట్ ఇవ్వనున్నారని ఇలా ఏవేవో చెప్పి తన పరువు తనే తీసుకున్నాడు. తనను హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా వస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ ఒట్టి కబుర్లేనని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. కౌశల్ చెప్పినట్లుగా తనకు సినిమాల్లో ఆఫర్లు ఏం వచ్చినట్లు కనిపించట్లేదు.

ఇదిలా ఉంటే కౌశల్ ఇప్పుడు తాను మళ్ళీ సీరియల్స్ కు వస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. సూర్యవంశం సీరియల్ లో ఆది శంకర్ పాత్రలో తాను మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. కౌశల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెల్సిందే. అయితే ఆది శంకర్ పాత్రలో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెబితే నెటిజన్స్ దీనిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఒక వ్యక్తి “అదేంటి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయన్నావ్, మళ్ళీ సీరియల్స్ కే వచ్చావ్. బిగ్ బాస్ 2 ముందు ఎక్కడ ఉన్నావో మళ్ళీ అక్కడికే వచ్చావ్. ఆల్ ది బెస్ట్” అని వెటకారంగా వ్యాఖ్యానించాడు. మరొకరు ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావంటూ గాలి తీసేసాడు. దీనికి కౌశల్ స్పందిస్తూ చిన్న స్క్రీనా పెద్ద స్క్రీనా మ్యాటర్ కాదు. మీతో టచ్ లో ఉండటం ముఖ్యం అంటూ రిప్లై ఇచ్చాడు.

బిగ్ బాస్ 2 సందర్భంగా తాను బిగ్ బాస్ 2 లోకి రావడానికి పరోక్షంగా మహేష్ బాబు సహాయం చేసాడని చెప్పిన విషయం తెల్సిందే. రాజకుమారుడు సమయంలో మహేష్ బాబుతో పరిచయమైంది. తన ప్రోద్బలంతోనే హైదరాబాద్ లో మొదటి మోడలింగ్ ఏజెన్సీను స్థాపించాను. పవన్ కళ్యాణ్ కూడా ఖుషి, బద్రి సమయంలో తనని సపోర్ట్ చేసినట్లు చెప్పుకొచ్చిన సంగతి తెల్సిందే.