కవచం రివ్యూkavacham movie review
కవచం రివ్యూ

కవచం రివ్యూ :
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ , మెహరీన్
సంగీతం : తమన్
నిర్మాత : నవీన్
దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ళ
రేటింగ్ : 3. 25/ 5
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్కాజల్ అగర్వాల్ జంటగా శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ నిర్మించిన చిత్రం ” కవచం ”. ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ కు కవచం లా నిలబడిందా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడే సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్ )విశాఖపట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటాడు . కాఫీ షాప్ లో పనిచేసే సంయుక్త ( కాజల్ అగర్వాల్ ) ని ప్రేమిస్తాడు విజయ్ కానీ ఆ ప్రేమ విషయం చెప్పేలోపే ఆమెకు మరొకరితో పెళ్లి కుదురుతుంది . ప్రమాదంలో ఉన్న అమ్మాయి ( మెహరీన్ ) ని కాపాడతాడు విజయ్ , అయితే ఓ అవసర నిమిత్తం డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడతారు ? కానీ డ్రామా అనుకుంటే నిజంగానే సంయుక్త కిడ్నాప్ అవుతుంది . పైగా తనకు పరిచయమైన ఇద్దరు అమ్మాయిల పేర్ల తో మరో షాక్ తగులుతుంది విజయ్ కి . అసలు కాఫీ షాప్ అమ్మాయి ఎవరు ? ప్రమాదంలో తనకు కలిసిన అమ్మాయి ఎవరు ? సంయుక్త ని కిడ్నాప్ చేసిందెవరు ? విజయ్ వాళ్ళని కాపాడాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

బెల్లంకొండ సాయి శ్రీనివాస్
కాజల్ అగర్వాల్
మెహరీన్ గ్లామర్
యాక్షన్ సీన్స్
ట్విస్ట్ లు

డ్రా బ్యాక్స్ :

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్

 

నటీనటులు :

పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతంగా నటించాడు . యాక్షన్ హీరోగా చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి . ఇక డ్యాన్స్ లో , ఫైట్ల్స్ లలో బాగా రాణించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . కాజల్ అగర్వాల్ తో ఈ కుర్రోడి కెమిస్ట్రీ బాగానే కుదిరింది . కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు ఇద్దరు కూడా గ్లామర్ ని ఒలికించారు అలాగే తమ నటనతో కూడా ఆకట్టుకున్నారు . విలన్ గా నీల్ నితిన్ స్టైలిష్ లుక్ లో మెప్పించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

తమన్ అందించిన నేపథ్య సంగీతం కవచం కు కవచం లా నిలబడింది అయితే పాటలలో మాత్రం విఫలమయ్యాడు . ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . వైజాగ్ అందాలను మాత్రమే కాకుండా హీరోయిన్ లను అలాగే హీరోని మరింత అందంగా చూపించాడు చోటా . ఇక యాక్షన్ సీన్స్ ని కూడా బాగా తీసాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి , బెల్లంకొండ చెప్పినట్లు తక్కువ బడ్జెట్ లోనే రిచ్ క్వాలిటీ ని చూపించారు . ఇక దర్శకుడు శ్రీనివాస్ విషయానికి వస్తే ……. అనేక ట్విస్ట్ లతో యాక్షన్ ఎలిమెంట్ ని తీసుకొని కుర్ర హీరోతో కమర్షియల్ ఎటెంప్ట్ చేసాడు , రాణించాడు కూడా అయితే కథనంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

కమర్షియల్ సినిమాలను కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ కవచం

English Title: kavacham movie review

                                         Click here for English Review