కేసీఆర్ ప్రభుత్వం స్టూడియో స్థలాలను తీసుకోనున్నారా


kcr eyes on film nagar studios

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సినిమా స్టూడియో లకు ఇచ్చిన స్థలాలను కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోనున్నారా ? అంటే నిజమే నేమో అన్న అనుమానం తలెత్తుతోంది ఎందుకంటే కొంతమంది స్టూడియో అధినేతలతో ప్రభత్వం స్థలాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది . ఇప్పుడున్న స్టూడియో లు అన్నీ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నాయి దాంతో ఆ స్థలాలు ప్రభుత్వానికి ఇస్తే వాటికి బదులుగా హైదరాబాద్ శివారులో సకల సౌకర్యాలతో స్టూడియోలను తిరిగి నిర్మించి ఇస్తామని ప్రతిపాదన పెట్టారట .

అయితే ప్రభుత్వ ప్రతిపాదన కు ఒక్క స్టూడియో అధినేత కూడా ఒప్పుకోలేదట ! స్టూడియో లను ఇవ్వడానికి అందరు కూడా ముక్త కంఠంతో నిరాకరించారట ! ఇక ఇంతకుముందే కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టూడియో లను నిర్మించాలని ప్రయత్నాలు చేసారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి సొంత రాష్ట్రంలో తప్పకుండా స్టూడియో ఉండాలని భావిస్తున్నారు సదరు స్టూడియో అధినేతలు . అయితే ప్రభుత్వం సూచన ప్రాయంగా ప్రతిపాదన మాత్రమే తెచ్చిందట అంతేకాని స్థలాలను పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశ్యం మాత్రం కాదట !

English Title: kcr eyes on film nagar studios