కేసీఆర్ కు మరో షాక్ తగలనుందా ?KCR
KCR

నిన్నటికి నిన్న మాజీ ఎంపీ గడ్డం వివేక్ కేసీఆర్ కు షాక్ ఇచ్చి బీజేపీ లో చేరాడు . పైగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు . ఇక ఇప్పుడేమో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు షాక్ ఇచ్చి బీజేపీ లో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . గతకొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారయ్యింది . గత పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి కి మళ్ళీ పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించారు కేసీఆర్ .

ఎంపీ టికెట్ కాకుండా ఎం ఎల్ సి గా ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారట ! అయితే ఇటీవలే గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎం ఎల్ సి గా ఛాన్స్ ఇచ్చాడు కేసీఆర్ కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మాత్రం హ్యాండ్ ఇచ్చాడు దాంతో అవమానాలు భరించలేక , రాజకీయ సమాధి అవ్వడం ఇష్టంలేక భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాడట . త్వరలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ లో చేరడం ఖాయమని తెలుస్తోంది .