తెలంగాణ శాసనసభ రద్దు ?


kcr master plan : ready to assembly electionsతెలంగాణ శాసనసభ ని సెప్టెంబర్ లో రద్దు చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది . ప్రతిపక్షం ఇంకా బలంగా కాకముందే శాసనసభ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అని తీవ్రంగా ఆలోచన చేసిందట . నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది . సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చాడు . ఆరు నెలల ముందుగా ఎన్నికలు వస్తే దాన్ని ముందస్తు ఎన్నికలు అనరని , సెప్టెంబర్ లో మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని ఇక ముసుగులో గుద్దులాట అవసరం లేదని ఎన్నికలకు మేము సిద్ధమని వందకు పై చిలుకు స్థానాలను గెల్చుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోయింది , ఇక కాంగ్రెస్ పడుతూ లేస్తూ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా వెళుతోంది ,ఇక మిగతా పార్టీలు ఊసులో లేకుండా పోయాయి అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం మేము ప్రతిపక్షం లోకైనా వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే కేసీఆర్ వ్యూహం ప్రకారం ఏ పార్టీ కి తెలంగాణ లో అంతగా ఆదరణ లేదని అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాస్త పుంజుకునే అవకాశం ఉన్నందున ఈలోపే ఎన్నికలకు వెళితే ప్రతిపక్షాలను చావు దెబ్బ కొట్టొచ్చని భావిస్తున్నాడు ,అందుకే సెప్టెంబర్ లో అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం శాసన సభ ని రద్దు చేసే యోచనలో ఉన్నారట . శాసనసభ రద్దు అయితే డిసెంబర్ లోనే ఎన్నికలు రానున్నాయి .

English Title: kcr master plan : ready to assembly elections