టీఆర్ఎస్ సర్వే అంతా బోగస్


KCR serveyed by dummy companyతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయించిన సర్వే అంతా బోగస్ అని అంటున్నారు . ఎందుకంటే కేసీఆర్ చేయించిన సర్వే ఎవరితో తెలుసా …….. విడిపి అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థతో సర్వే చేయించాడట అయితే దానికి అంత విశ్వసనీయత లేదని గూగుల్ సంస్థ తేల్చేసింది . సదరు కంపెనీ కి కనీసం పూర్తిస్థాయి వెబ్ సైట్ కూడా లేదని అలాంటి సంస్థ చేపట్టిన సర్వే కు ప్రాముఖ్యత లేదని అంటున్నారు . తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ అధికారం చేపడతాడని 80 స్థానాలు వస్తాయని సదరు సంస్థ పేర్కొనడం హాస్యాస్పదం అవుతోంది .

ఇక ఆజ్ తక్ అనే సంస్థ కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ తేల్చేసింది అయితే ఇక్కడో చిన్న డౌట్ కేసీఆర్ సర్వే చేయించిన దాంట్లో 100 కు పైగా సీట్లు సాధిస్తామని పదేపదే చెబుతున్నాడు మరి ఇక్కడే వేరే సంస్థలు చెబుతున్న లెక్కల ప్రకారం చాలా తగ్గింది . ఇక ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి అలాగే టికెట్ రానివాళ్లు వచ్చిన వాళ్లని ఓడించడానికి తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేస్తారు . ఆ పరిస్థితుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కొంతమంది ఇబ్బందిపడటం ఖాయం . దానికితోడు తెలంగాణలో కేసీఆర్ ని ఓడించడానికి మహాకూటమి రెడీ అవుతోంది దాంతో కూడా తప్పకుండా టీఆర్ఎస్ గెలుపోటములు డిసైడ్ అవుతాయి మరి .

English Title: KCR serveyed by dummy company