మహేష్ బాబుకు అండగా కేసీఆర్


మహర్షి చిత్రానికి స్పెషల్ పర్మీషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం . కేసీఆర్ ప్రభుత్వం మహేష్ బాబు కి అండగా నిలబడింది . కేసీఆర్ ప్రభుత్వం మహేష్ బాబు కు అండగా ఉండటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహర్షి చిత్రానికి 5 వ ఆట కూడా ప్రదర్శించే అవకాశం కల్పించింది . మహేష్ బాబు కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే . అందుకే ఒత్తిడి ఎక్కువ ఉండటంతో రోజుకి నాలుగు షోలకు బదులుగా అయిదవ షోకి కూడా పర్మీషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రానికి అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . అది రోజు రోజుకి అమాంతం ఎక్కువ అవుతుండటంతో ఆ క్రేజ్ కు తగ్గట్లుగా తెలంగాణలో స్పెషల్ షోకి అనుమతి లభించింది . ఇక అంతకుముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహర్షి చిత్రానికి స్పెషల్ పర్మీషన్ ఇచ్చింది దాంతో మొదటి రోజున రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది .