కేసీఆర్ ఓడిపోతున్నాడట


KCR will loss gajwel seat : Lagadapati

గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయమని అంటున్నాడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ . ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ తాజాగా తెలంగాణలో సర్వే చేయించాడు . అయితే ఆ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని , టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడమే కాకుండా కేసీఆర్ కూడా గజ్వేల్ లో ఓడిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు లగడపాటి .

గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తుండగా కేసీఆర్ ఓడిపోయి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గెలవడం ఖాయమని అంటున్నారు . అలాగే పలువురు ప్రజలు కూడా ఒంటేరు కి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు దాంతో కేసీఆర్ ఓటమి ఖాయమని తెలుస్తోంది . ఈ విషయాన్నీ గజ్వేల్ లోని పోలీసులు లగడపాటి కి స్వయంగా వెల్లడించారట . అయితే కేసీఆర్ మాత్రం వంద సీట్లకు తక్కువ రానేరావు అంటూ సవాల్ చేస్తున్నాడు . ఏమౌతుందో రేపు పోలింగ్ కాగా డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి .

English Title: KCR will loss gajwel seat : Lagadapati