ఉత్తమ విలన్ మీద కేసు పెట్టిన నిర్మాతKE Gnanavel Raja
ఉత్తమ విలన్ మీద కేసు పెట్టిన నిర్మాత

మీకు ‘ఉత్తమ విలన్’ గుర్తున్నాడా? అదేనండి తమిళ, తెలుగు సినిమాలలో లోకనాయకుడిగా ప్రసిద్ధిగాంచిన “కమల్ హాసన్” గారు నటించిన సినిమా పేరు “ఉత్తమ విలన్”. 2015 లో విడుదల అయ్యిన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సమస్యని తెచ్చిపెట్టింది.

ఉత్తమ విలన్ సినిమాకి దర్శకుడు కన్నడ యాక్టర్ “రమేష్ అరవింద్” గారు, నిర్మాతలుగా ‘కమల్ హాసన్‘ మరియు ‘ఎన్. లింగుస్వామి గారు’. అలాగే సినిమాకి కథ రాసింది కూడా మన కమల్ హాసన్ గారే. అలా ఈ సినిమాకి శ్రీకారం చుట్టగా, కమల్ హాసన్ గారు నిర్మాతల్లో ఒకరు కాబట్టి అప్పుడు డబ్బు విషయం లో ప్రముఖ తమిళ నిర్మాత‌ స్టూడియో గ్రీన్ అధినేత ‘కె.ఈ జ్ఞాన‌వేల్ రాజా’ దగ్గర 10 కోట్లు తీసుకున్నారంటా. రాజా గారు డబ్బు ఇచ్చేటప్పుడు..మీ బ్యానర్ లో నేను సినిమా చేస్తా అని మాట ఇచ్చి కమల్ హాసన్ గారు 10 కోట్లు తీసుకున్నారంటా.

మరి ఇప్పుడు ఉత్తమ విలన్ సినిమా వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అంటా, సినిమా కూడా చేస్తానని చెప్పలేదంటా. మరి ఇక ఏమి చేయాలో తెలియక రాజా గారు తమిళ్ సినిమా నిర్మాత మండలిలో కమల్ హాసన్ గారి మీద కేసు పెట్టారంటా. చేస్తే సినిమా చేయమని, లేదా నా డబ్బు నాకు ఇప్పంచండి అని నిర్మాత మండలిని కోరారంటా, మరి నిర్మాత మండలి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.

మరి మన ఉత్తమ విలన్ గారేమో ‘భారతీయుడు-2’ సినిమా షూటింగ్ బిజీ లో ఉన్నారు. ఆ సినిమాలో మన చందమామ ‘కాజల్ అగర్వాల్’ హీరోయిన్. ఇంకా ఈ సినిమాలో ‘సిధార్థ’ మరియు ‘రకుల్ ప్రీత్ సింగ్’ కూడా సినిమాలో నటిస్తున్నారు. సినిమాకి సంగీతం ‘అనిరుద్’ అందిస్తున్నారు.
మరి రాజా గారు పెట్టిన కేసు ఏ విధంగా పరిష్కరించడానికి అవుతుందో చూద్దాం.