ఆ సినిమాని వివాదాలు చుట్టుముడుతున్నాయి


Kedarnath priests protest against Kedarnath movie

బాలీవుడ్ చిత్రం ” కేదార్ నాథ్ ” చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి . టైటిల్ చూస్తేనే అర్ధం అవుతోంది హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్యస్థలం అయిన కేదార్ నాథ్ పై రూపొందిన ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని చెప్పడానికి . బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇంతకుముందే కేదార్ నాథ్ టీజర్ రిలీజ్ కాగా డిసెంబర్ 7న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఎట్టి పరిష్టితుల్లో కేదార్ నాథ్ చిత్రాన్ని విడుదల కానివ్వమని , హిందువుల మనోభావాలు కించపరిచేలా చిత్రాన్ని రూపొందించారని కేదార్ నాథ్ ఆలయ పూజారులు మండిపడుతున్నారు .

లవ్ జిహాదీ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా , హిందువులను అవమానించేలా సినిమా చేసారని అలాంటి సినిమా విడుదల అయితే మరింత అవమానకరమని ఆందోళన తీవ్రతరం చేసారు పూజారులు . 2013 లో కేదార్ నాథ్ లో వరదలు వచ్చి వందలమంది చనిపోయిన విషయం తెలిసిందే . ఆ నేపథ్యాన్ని ఎంచుకొని సినిమా చేసారు . అయితే దర్శక నిర్మాతలు మాత్రం మా సినిమాలో వివాదాస్పద అంశాలు లేవని అంటున్నారు . డిసెంబర్ 7 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూనే ఉన్నారు .

English Title: Kedarnath priests protest against Kedarnath movie