వామ్మో! కీరవాణి పారితోషికం వింటే మతిపోవాల్సిందే`


Keeravani mind blowing remuneration for RRR
Keeravani mind blowing remuneration for RRR

ఇండస్ట్రీలో సాంకేతిక నిపుణులకు అందే పారితోషికం అందరూ ఊహించుకునే దానికంటే తక్కువే ఉంటుంది. అందులోనూ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అయిన సంగీత దర్శకులతో మహా అయితే కోటి – 2 కోట్లు మరీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే 3-4 కోట్ల దాకా ఉంటుంది. బడ్జెట్ ను బట్టి ఈ రెమ్యునరేషన్ వేరీ అవుతూ ఉంటుంది. తెలుగు వరకూ దేవి శ్రీ ప్రసాద్ అత్యధిక పారితోషికం అందుకుని రికార్డు సృష్టించాడు. టాప్ ఫామ్ లో ఉన్న సమయంలో దేవి 4 కోట్ల వరకూ వసూలు చేసాడని వినికిడి. ఇప్పుడు అది 3 కోట్ల రేంజ్ కు తగ్గింది. ప్రస్తుతం టాప్ ఫామ్ లో కొనసాగుతున్న థమన్ కూడా ఇంతకంటే తక్కువకే పనిచేస్తున్నాడు. అందుకే దర్శకులు, నిర్మాతలకు థమన్ టాప్ ప్రయారిటీ అయ్యాడు.

తమిళంలో అనిరుధ్ ప్రస్తుతం టాప్ లో ఉన్నాడు. ఇక బాలీవుడ్ కూడా తీసుకుంటే ఏ ఆర్ రహ్మాన్ 7-8 కోట్ల దాకా సినిమాకు తీసుకుంటాడని వినికిడి. అయితే వీరందరినీ పక్కకు నెట్టి ఇప్పుడు ఎం ఎం కీరవాణి అత్యంత పారితోషికం అందుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నాడు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ కు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న కీరవాణి ఈ చిత్రం ద్వారా 16 కోట్ల వరకూ జేబులో వేసుకోనున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ కు రాజమౌళితో పాటు తన ఫ్యామిలీలో చాలా మంది పనిచేస్తున్న విషయం తెల్సిందే. వీరందరికీ విడివిడిగా కాకుండా ఒక ప్యాకేజ్ లా పారితోషికం అందుతుంది. అందులోనుండి వాటాలు వేసుకుంటారు. ఆర్ ఆర్ ఆర్ కు రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ కు బడ్జెట్ కన్నా డబల్ లెవెల్లో బిజినెస్ జరుగుతోంది. హీరోలతో పాటు రాజమౌళి కూడా భారీగా వెనకేసుకోనున్నాడు. లాభాల్లో వచ్చిన దాంట్లోంచి కీరవాణికి వాటా వేయగా 16 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అత్యధిక పారితోషికం అందుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి రికార్డు సృష్టించడం ఖాయం.