కీరవాణీ ఏం తాగి కొట్టావ్ సామి!


 

keeravani special music to be highlight for RRR
keeravani special music to be highlight for RRR

ఎం ఎం కీరవాణి.. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తనతో మ్యూజిక్ డైరెక్టర్ లు అయిన వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అయిపోయారు కానీ కీరవాణి మాత్రం ఇంకా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికీ కీరవాణి నుండి అద్భుతమైన ట్యూన్ లు మనం వింటూనే వస్తున్నాం. అయితే ఇది వరకటంత జోరు ఇప్పుడు కీరవాణిలో లేదన్నది మాత్రం సత్యం. చేసే సినిమాల పరంగా కూడా కీరవాణి చాలా నెమ్మదించాడు. అయితే రాజమౌళితో సినిమా అంటే మాత్రం కీరవాణి చెలరేగిపోతాడు. పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ దేనికదే స్పెషల్ గా ఉంటాయి. బాహుబలి వంటి ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ కు దానికి తగ్గట్లుగానే సంగీతం అందించాడు. ముఖ్యంగా బాహుబలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి సినిమాలకు కీరవాణి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నది సత్యమే.

ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు సంగీతం అందిస్తున్నాడు కీరవాణి. మరి ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఉంటుందోనని ఆశలు పెట్టుకున్న వాళ్లకు నమ్మకాన్ని ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన రెండు వీడియోల్లో కీరవాణి మ్యూజిక్ హైలైట్ అయింది. మోషన్ పోస్టర్ కానీ రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్ వీడియో కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా చేసాయి. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్ వీడియోలో సరికొత్త సౌండ్స్ ను ఉపయోగించాడు. మధ్యలో డప్పులు కామన్ గానే వచ్చినా కానీ మళ్ళీ తనదైన శైలి టచ్ కు వెళ్లిపోవడంతో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కు ఈ రెండు వీడియోలు సూపర్బ్ గా హెల్ప్ అయ్యాయి.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, చరణ్ స్క్రీన్ ప్రెజన్స్, రాజమౌళి టేకింగ్, స్టన్నింగ్ విజువల్స్.. వీటికి తోడు కీరవాణి మ్యూజిక్ కూడా హెల్ప్ అవ్వడంతో ఇప్పుడు చరణ్ బర్త్ డే స్పెషల్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఒక్క తెలుగులోనే కాక మిగతా భాషల్లో కూడా ఈ వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు.