సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌తో జ‌త‌క‌డుతోంది!


సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌తో జ‌త‌క‌డుతోంది!
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌తో జ‌త‌క‌డుతోంది!

7జి బృందావ‌న కాల‌నీ, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, యుగానికి ఒక్క‌డు వంటి చిత్రాల‌తో విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు సెల్వ‌రాఘ‌వ‌న్‌. ఇటీవ‌ల సూర్య‌తో చేసిన `ఎన్‌జీకే` దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో సెల్వ‌రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్ ప‌క్క‌న పెట్టి తాజాగా న‌టుడిగా కొత్త అవాతారం ఎత్తారు. ఆయ‌న న‌టిస్తున్న త‌మిళ చిత్రం `సానీ కాయిద‌‌మ్‌`. అరుణ్ మాతేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ న‌టుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా విభిన్న చిత్రాల‌ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయ‌న ఈ సినిమాతో కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. ఇందులో విశేషం ఏమిటంటే ఇందులో సెల్వ‌రాఘ‌వ‌న్‌తో క‌లిసి క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో వీరిద్ద‌రు బందిపోటు దొంగ‌లుగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ ఎడ‌మ చేతిలో నాటు తుపాకి, భుజంపై వేట కొడ‌వ‌లితో క‌నిపిస్తోంది. సెల్వ‌రాఘ‌వ‌న్ హాఫ్ ష‌ర్ట్‌, షార్ట్ ధ‌రించి కుడి చేతిలో ర‌క్త‌మోడుతున్న క‌త్తిని ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. ఈ ఇద్ద‌రు ఆగివున్న టెంపో వాహ‌నం ముందు దాడికి సిద్ధంగా వున్న‌ట్టుగా క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. 1980లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.