నెటిజ‌న్‌కు కీర్తిసురేష్ బ్రిలియంట్ రిప్లై!

నెటిజ‌న్‌కు కీర్తిసురేష్ బ్రిలియంట్ రిప్లై!
నెటిజ‌న్‌కు కీర్తిసురేష్ బ్రిలియంట్ రిప్లై!

మ‌హాన‌టి సావిత్రివి జీవిత క‌థఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `మ‌హాన‌టి` మూవీతో కీర్తి సురేష్ న‌టిగా త‌నేంటో జాతీయ స్థాయిలో నిరూపించుకుంది. ఈ చిత్రానికి గాను జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకుంది. ఆ మూవీ త‌రువాత మ‌హిళా ప్రధాన చిత్రాల్లో న‌టిస్తోంది. ఆమె న‌టించిన `పెంగ్విన్` ఇప్ప‌టికే విడుద‌లైంది. తాజాగా ఇదే త‌ర‌హాలో కీర్తిసురేష్ న‌టించిన `మిస్ ఇండియా` నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లై డివైడ్ టాక్‌ని తెచ్చుకుంది.

న‌రేంద్ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కొత్త త‌ర‌హా పాయింట్‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఛాయ్ , కాపీ బిజినెస్‌ల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోలేక‌పోతోంది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా కీర్తి సురేష్ నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించింది. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించింది.

ఈ క్ర‌మంలో కీర్తిని ఓ నెటిజ‌న్ మీరు సింగిలా.. క‌మిట‌య్యారా? అని ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు కీర్తి చాలా బ్రిలియంట్‌గా రిప్లై ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. క‌మిటెడ్ టు వ‌ర్క్ అంటూ స‌మాధానం చెప్పింది. దీంతో ఆమె చ‌తుర‌త‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ `రంగ్‌దే`తో పాటు మ‌హేష్ న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తోంది. త్వ‌ర‌లో ఈ మూవీ షూటింగ్ యుఎస్‌లో ప్రారంభం కాబోతోంది.