ఓటీటీలోకి కీర్తిసురేష్ మ‌రో చిత్రం!


ఓటీటీలోకి కీర్తిసురేష్ మ‌రో చిత్రం!
ఓటీటీలోకి కీర్తిసురేష్ మ‌రో చిత్రం!

క‌రోనా కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే రిలీజ్‌కు సిద్ధ‌మైన చాలా చిత్రాలు థియేట‌ర్లు రీఓపెన్ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు మ‌రి కొంత కాలం తెరిచే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో నిర్మాత‌ల్లో చాలా మంది ఓటీటీ బాట‌ప‌డుతున్నారు. రిలీజ్‌కు రెడీగా వున్న త‌మ చిత్రాల్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నారు. కొంత మందికి భారీ మొత్తం అందితే మ‌రి కొంత మందికి మాత్రం సో సోగా అమౌంట్ ల‌భిస్తోంది.

అయినా స‌రే థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌క‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు నిర్మాత‌లు ఓటీటీల‌కు జై కొడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కీర్తి సురేష్ న‌టిస్తున్న మ‌రో భారీ చిత్రం కూడా ఓటీటీ బాట‌ప‌డుతోందంటూ గ‌త కొన్ని రోజులుగా జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ న‌టించిన `పెంగ్విన్‌` ఇటీవ‌లే డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే.

అదే త‌ర‌హాలో కీర్తిసురేష్ న‌టించిన మ‌రో చిత్రం `మిస్ ఇండియా` కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన చ‌ర్చల్లో నిర్మాత కోనేరు మ‌హేష్ పాల్గొంటున్నార‌ని, ఇప్ప‌టికే ఓ ప్ర‌ముఖ ఓటీటీ కంపెనీతో మ‌హేష్ డీల్‌ని ఫైన‌ల్ చేసుకున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రిలీజ్‌పై క్లారిటీ రానుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.