మ‌హాన‌టి గ్రేట్ డైరెక్ట‌ర్‌కే షాకిచ్చేసిందిగా?


మ‌హాన‌టి గ్రేట్ డైరెక్ట‌ర్‌కే షాకిచ్చేసిందిగా?
మ‌హాన‌టి గ్రేట్ డైరెక్ట‌ర్‌కే షాకిచ్చేసిందిగా?

`ఒకే బంగారం` స‌క్సెస్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈ సినిమా విజ‌యం త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో వున్న ఆయ‌న గ‌త కొంత కాలంగా `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌, భారీ తారాగ‌ణం కావ‌డంతో ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ఏ నిర్మాణ సంస్థ ముందుకు రాలేదు. త‌నే నిర్మాత‌గా, మ‌రో సంస్థ‌ని పార్ట్‌న‌ర్‌గా చేర్చుకుని సినిమా చేయాల‌నుకున్నారు. కానీ ఫైనాన్షియ‌ర్స్ వెన‌క్కి త‌గ్గ‌డంతో సినిమాని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్ని తాత్కాలికంగా విర‌మించుకున్నారు.

ది గ్రేట్ రైట‌ర్ క‌ల్కీ కృష్ణ‌మూర్తి రాసిన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌న్న‌ది మ‌ణిర‌త్నం క‌ల. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని శ‌నివారం ప్రారంభించారు. ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ త‌ప్పుకున్న‌ట్లు తెలిసింది. ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న 168 చిత్రాన్ని వ‌దులు కోలేకే కీర్తి ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలిసింది. శివ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ త‌లైవ‌ర్ వ‌ర్కింగ్ టైటిల్‌లో ర‌జ‌నీ 168వ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ర‌జ‌నీకి జోడీగా కీర్తిసురేష్ న‌టిస్తున్నారు. ర‌జ‌నీతో న‌టించాల‌న్న‌ది త‌న క‌ల అని, ఆ కార‌ణంగానే `పోన్నియ‌న్ సెల్వ‌న్‌` చిత్రం నుంచి త‌ప్పుకున్న‌ట్టు కీర్తి వెల్ల‌డించింద‌ని ఆమె స‌న్నిహితులు వెల్ల‌డించారు.

అయితే ద‌క్షిణాదిలోనే గ్రేట్ డైరెక్ట‌ర్‌గా పేరున్న మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించాల‌ని ప్ర‌తీ న‌టి, న‌టుడు క‌ల‌లు కంటారు. అలాంటి ద‌ర్శ‌కుడికే కీర్తి షాకివ్వ‌డం త‌మిళ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 11న ర‌జ‌నీ చిత్రం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మీనా, ఖుష్బూ, ప్ర‌కాష్‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.