అలిమేలుమంగ.. హీరోయిన్ మారిందా?


Keerthy suresh or anushka to replace kajal in tejas movies
Keerthy suresh or anushka to replace kajal in tejas movies

మనకున్న విలక్షణ దర్శకులలో తేజకు ప్రత్యేకమైన స్థానముంది. ప్రేమకథల్ని కొత్త పుంతలు తొక్కించిన తేజ వరసగా సూపర్ హిట్లు అందుకున్నాడు. అయితే తాను కనిపెట్టిన ఫార్ములా తనకే తిరిగి బెడిసికొట్టింది. ప్రేమకథలలో ఒక మూసలో పడిపోయి వరసపెట్టి ప్లాపులను చవిచూస్తూ వచ్చాడు. అయితే ఇక తేజ పనైపోయిందనుకున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు కానీ నేనే రాజు నేను మంత్రి సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే హిట్స్ ఇవ్వడంలో కన్సిస్టెన్సీ మైంటైన్ చేయలేక కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీత సినిమాతో మరో ప్లాప్ ను అందుకున్నాడు. ఆ తర్వాతి నుండి సైలెంట్ గా మారిపోయిన తేజ ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే.

గోపీచంద్ హీరోగా అలిమేలు మంగ వెంకట రమణ, రానా హీరోగా రాక్షసరాజు రావణాసురుడు అనే రెండు భిన్నమైన టైటిల్స్ తో రెండు సినిమాలను ప్రకటించాడు తేజ. ప్రస్తుతం రానా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ముందుగా గోపీచంద్ హీరోగా అలిమేలు మంగ వెంకట రమణ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా సెట్ చేద్దామనుకున్నాడు కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కాజల్ తో వరసగా రెండు సినిమాలు చేసాడు తేజ. ఇప్పుడు మళ్ళీ కాజల్ అంటే మొనాటనీ వచేస్తుందన్న ఫీలింగ్ తో ఇప్పుడు అనుష్క శెట్టి లేదా కీర్తి సురేష్ లలో ఎవరినో ఒకర్ని ఫైనల్ చేయాలనుకుంటున్నాడు. ముందుగా కీర్తి సురేష్ తో సంప్రదింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. కాల్ షీట్స్ వ్యవహారం, రెమ్యునరేషన్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కీర్తి సురేష్ వ్యవహారం తేలిపోతుంది. ఆమె ఓకే కాదనుకుంటే అనుష్కతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. అటు గోపీచంద్ కు ఇటు తేజకు ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం. మరి ఇద్దరికీ కావాల్సిన హిట్ ను అందుకుంటారో లేదో చూడాలి.