లిప్ లాక్ లకు రెడీ కానీ ..నాక్కొంచెం సిగ్గెక్కువ


keerthy suresh ready to lip lock roles

సినిమాల్లోకి హీరోయిన్ గా నటించడానికి రావడం అంటేనే అన్ని రకాల పాత్రలకు సిద్దమవ్వాల్సి ఉంటుందని నాకు తెలుసు , ఇక లిప్ లాక్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది నేను రెడీ కానీ …… నాక్కొంచెం సిగ్గెక్కువ ! అయినా ఇప్పటివరకు నన్ను ఏ దర్శకుడు కూడా లిప్ లాక్ సీన్లో నటించమని ఒత్తిడి చేయలేదు దాంతో నేను లక్కీ అనే అనుకుంటున్నాను అని అంటోంది మహానటి చిత్రంలో నటించి ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందిన కీర్తి సురేష్ . తమిళ భామ అయిన కీర్తి సురేష్ కు తెలుగునాట కూడా మంచి డిమాండ్ ఉంది , ఇక మహానటి తో తన చరిత ని చరితార్థం చేసుకుంది .

అయితే ఈ భామ పక్కింటి అమ్మాయి లా కనిపిస్తుంది కాబట్టి పెద్దగా గ్లామర్ పాత్రలు , ఎక్స్ పోజింగ్ పాత్రలు దర్శక నిర్మాతలు ఇవ్వలేదు , గ్లామర్ ఒలకబోసే పాత్రలే రానప్పుడు ఇక లిప్ లాక్ లు ఎలా చేయిస్తారు దాంతో నాకు ఆ ఛాన్స్ దొరకలేదు అని అంటోంది కీర్తి సురేష్ . తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించింది ఈ భామ . అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ భామ కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ లు ఇవ్వడానికి సిద్దమే అని అంటోంది .

కీర్తి సురేష్ కి కాస్త సిగ్గు ఎక్కువే నట ! దాంతో ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో ఇబ్బంది పడుతుంటానని కానీ అది కూడా నటనలో ఒక భాగం కాబట్టి తప్పదని అంటోంది . కీర్తి సురేష్ లిప్ లాక్ లకు రెడీ అంటోంది మరి ఇక ఆలస్యం దర్శక నిర్మాతలది , హీరోలది . ఎవరు కీర్తి సురేష్ కు ఆ ఛాన్స్ ఇస్తారో చూడాలి .

 

English Title:keerthy suresh ready to lip lock roles