రానాకు మిస్ ఇండియా నో చెప్పడానికి కారణాలేంటి?


Rana Daggubati
రానాకు మిస్ ఇండియా నో చెప్పడానికి కారణాలేంటి?

రానా దగ్గుబాటి గుణశేఖర్ తో చేయాల్సిన మైథలాజికల్ పీరియాడిక్ డ్రామా హిరణ్యకశ్యప ఆలస్యం అవుతుండడంతో మిలింద్ రావు దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ సినిమాను ఓకే చేసిన విషయం తెల్సిందే. గృహం వంటి అదిరిపోయే హారర్ సినిమా తీసిన మిలింద్, ఈ ప్రాజెక్ట్ పై కూడా నమ్మకంగా ఉన్నాడు. అయితే ఇందులో కీర్తి సురేష్ ను హీరోయిన్ పాత్రకు తీసుకోగా, ఆమె నో చెప్పినట్లు సమాచారం.

కారణాలు తెలియదు కానీ కీర్తి సురేష్ డేట్స్ ఖాళీగా ఉన్నా కూడా మిలింద్ – రానా ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించలేదట. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కు ఆఫర్ చేసింది పోలీస్ ఆఫీసర్ పాత్ర, అది కూడా కథను కీలక మలుపు తిప్పే పాత్ర. మరి అన్నీ అనుకూలంగా ఉన్నా కీర్తి ఎందుకని నిరాసక్తత చూపించిందోనని అనుకుంటున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం మిస్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. అది కూడా చివరి దశకు చేరుకుంది. కీర్తి నో చెప్పడంతో మిలింద్ అండ్ కో టీమ్ మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. నవంబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది.