కీర్తి సురేష్ మ‌రో బ‌యోపిక్‌కి రెడి?కీర్తి సురేష్ మ‌రో బ‌యోపిక్‌కి రెడి?
కీర్తి సురేష్ మ‌రో బ‌యోపిక్‌కి రెడి?

మహాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `మ‌హాన‌టి`. నాగ్ అశ్విన్ అద్భుతంగా ర‌పొందించిన ఈ చిత్రం కీర్తి సురేష్‌లోని న‌టిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. మ‌హాన‌టి సావిత్ర పాత్ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో ప్రాణం పోసి విమ‌ర్శ‌కులే కాదు సినీ పండితుల చేత ఔరా అనిపించింది.

ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ కీర్తిసురేష్ వ‌రుస‌గా బ‌యోపిక్‌లు చేసే అవ‌కాశః వుంద‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే రొటీన్ చిత్రాల్లో న‌టించ‌న‌ని, ప్ర‌స్తుతం త‌న దృష్టంతా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న క‌మర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ట‌పై వుంద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం మ‌హిళా ప్ర‌ధాన ఇత్రాలైన `మిస్ ఇండియా`, పెంగ్వీన్ తో పాటు నితిన్ హీరోగా న‌టిస్తున్న `రంగ్ దే` చిత్రంలో న‌టిస్తోంది.

ఇదిలా వుంటే కీర్తి సురేష్ తాజాగా మ‌రో బ‌యోపిక్‌ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. మ‌హిళా దర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ క‌మ్ డైరెక్ట‌ర్ విజ‌య నిర్మ‌ల‌. 50కి పైగా చిత్రాల్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. చంద్ర‌మోహ‌న్ నుంచి ర‌జ‌నీకాంత్ వ‌ర‌కు ఆమె డైరెక్ష‌న్‌లో న‌టించిన వారే. గ‌త ఏడాది చ‌‌నిపోయిన ఆమె జీవిత క‌థ‌ని త్వ‌ర‌లో  తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌. ఇందులో విజ‌య‌నిర్మ‌ల‌గా కీర్తి సురేష్‌ని అడుగుతున్నారని తెలిసింది.