కీర్తి సురేష్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేసింది!

కీర్తి సురేష్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేసింది!
కీర్తి సురేష్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేసింది!

కీర్తి సురేష్ `మ‌హాన‌టి` త‌రువాత చాలా వ‌ర‌కు మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కీర్తి న‌టిస్తున్న తాజా చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖీ`. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఏ వ‌ర్త్ ఏ షాట్ మోష‌న్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పా‌దిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ సోమ‌వారం ప్ర‌క‌టించారు.

ఈ చిత్రాన్ని జూన్ 3న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ని కూడా రిలీజ్ చేసింది. జాతీయ స్థాయిలో అత్యుత్త‌మ చిత్రాల్ని రూపొందించి ప‌లు అవార్డుల‌తో పాటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌టంతో ఈ మూవీపై స‌హ‌జంగానే భారీ అంచానాలు నెల‌కొన్నాయి.

ఓ గ్రామీణ మ‌హిళ జాతీయ స్థాయిలో షూట‌ర్‌గా ఎలా పేరు తెచ్చుకుంది. త‌ద్వారా దేశానిక ఎలాంటి గౌర‌వాన్ని తెచ్చిపెట్టింది అనే క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సాధార‌ణ మ‌హిళగా కీర్తి సురేష్ ఇందులో న‌టించింది. ఆమెని ప్రేమించే యువ‌కుడిగా ఆదిపినిశెట్టి క‌నిపించ‌నున్నాడు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.