కీర్తి `మిస్ ఇండియా`కి డేట్ ఫిక్స‌యిందా?


కీర్తి `మిస్ ఇండియా`కి డేట్ ఫిక్స‌యిందా?
కీర్తి `మిస్ ఇండియా`కి డేట్ ఫిక్స‌యిందా?

`మ‌హాన‌టి` చిత్రంతో ప్ర‌శంస‌లందుకున్న న‌టి కీర్తి సురేష్‌. ఈ సినిమా త‌న‌ని న‌టిగా జాతీయ స్థాయిలో నిల‌బెట్ట‌డంతో అప్ప‌టి నుంచి వ‌రుస‌గా న‌ట‌న‌కు ఆస్కార‌మున్న చిత్రాల్లో న‌టిస్తోంది. ఆమె న‌టించిన `పెంగ్విన్‌` ఇటీవ‌లే ఓటీటీ ప్లాట్ పామ్‌లో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో సినిమా ఓటీటీ రిలీజ్ రెడీ అవుతోంది. ఇటీవ‌ల టాలీవుడ్‌లోనూ భారీ చిత్రాల‌ని ఓటీటీకి అమ్మేస్తుండ‌టంతో మిగ‌తా చిత్రాలు కూడా ఇదే బాట‌ప‌డుతున్నాయి.

తాజాగా కీర్తి సురేష్ న‌టిస్తున్న `మిస్ ఇండియా` కూడా ఓటీటీ బాట‌ప‌డుతోంది. న‌రేంద్ర‌నాథ్‌ని డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తూ ఈస్ట్ కోస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని మ‌హేష్ కోనేరు నిర్మించారు. గ‌త కొన్ని రోజులుగా విడుద‌ల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న చిత్ర బృందం ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని ఓటీటీకే అమ్మేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

ప్రొడ్యూస‌ర్ అధికారికంగా ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నప్ప‌టికీ ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ‌లో అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టు తాజా స‌మాచారం. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో కొత్త పంథాలో నిర్మించిన ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫ‌ర్ ఇచ్చి ఈ చిత్ర డిజిట‌ల్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న‌ట్టు తెలిసింది. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం మ‌హేష్‌తో `స‌ర్కారు వారి పాట‌`, నితిన్‌తో `రంగ్ దే` వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. ప్ర‌భాస్ `ఆది పుర‌ష్‌` చిత్రంలోనూ న‌టించే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.