స్పోర్ట్స్ నేప‌థ్యంలో `కెన్న‌డీ క్ల‌బ్`


స్పోర్ట్స్ నేప‌థ్యంలో `కెన్న‌డీ క్ల‌బ్`
స్పోర్ట్స్ నేప‌థ్యంలో `కెన్న‌డీ క్ల‌బ్`

శ‌శికుమార్, భార‌తీరాజా, మీనాక్షి గోవింద‌రాజ‌న్‌, సూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `కెన్న‌డీ క్ల‌బ్‌`. సుశీంద్ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళ్ంలో రూపొందిన ఈ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ‌మ‌తి రావూరి అల్లికేశ్వ‌రి స‌మ‌ర్ప‌ణ‌లో అపోలో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత డా. రావూరి వెంక‌ట‌‌స్వామి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

క‌బ‌డ్డీ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చిత్ర బృందం ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో ఈ మూవీని సుశీంద్ర‌న్ చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు.

నిర్మాత డా. రాపూరి వెంక‌ట‌స్వామి మాట్లాడుతూ `సుశీంద్ర‌న్ క‌బ‌డ్డీ గేమ్  నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. త‌మిళంలో రూపొందిన ఈ చిత్రం అక్క‌డ అనూహ్య విజ‌యాన్ని సాధించింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాల‌న్నీ వున్న ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాం. ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీని విడుద‌ల చేస్తున్నాం` అన్నారు.