నాని వ్యాఖ్యలు దేనికి సంకేతం


 Kesineni Nani says I never fear enyone
Kesineni Nani says I never fear enyone

 

నేను నిజాయితీ పరుడ్ని , నేనెవరికీ భయపడేది లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని . తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంతో అధినేత చంద్రబాబు పై అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు పై ఆగ్రహంగా ఉన్నాడు , అసంతృప్తితో ఉన్నాడు కేశినేని నాని . గతకొద్ది రోజులుగా వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాడు .

వరుసగా పోస్ట్ లు పెడుతుండటంతో నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నాడా ? భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడా ? అన్న చర్చ మొదలయ్యింది . భారతీయ జనతా పార్టీ లోని అగ్ర నాయకులతో కేశినేని నాని కి మంచి పరిచయాలు ఉన్నాయి .దానికి తోడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో నాని చేరుతాడేమో ? అన్న చర్చా సాగుతోంది . దానికి ఊతమిచ్చేలా నాని పోస్ట్ లు ఉండటంతో బలం చేకూరుతోంది .