ఎన్టీఆర్ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ?

ఎన్టీఆర్ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ?
ఎన్టీఆర్ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. క్రితం నెల విడుదల చేసిన కొమురం భీమ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో ఎన్టీఆర్ కు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ వంటి హెక్టిక్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఓకే లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ ను చేయబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన అరవింద సమేత ఎమోషనల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఫ్యాక్షనిజం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాడు.

అందుకనే ఈసారి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మను హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. గత రెండు సినిమాలు అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించడంతో ఈసారి మరో హీరోయిన్ తో పనిచేయాలనుకుంటున్నాడు.

ప్రధాన హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు ఫ్రంట్ లైన్ లో ఉండగా రెండో హీరోయిన్ గా రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.