Fwd: సరికొత్త కథాంశంతో `రంగం` ఫేమ్ జీవా నటించిన `కీ`… తెలుగు, తమిళ భాషల్లో మే 11న విడుదల


రంగం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `కీ`. నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కలీస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృష్ణ క్రియేష‌న్స్‌, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బేన‌ర్స్ నిర్మాణంలో సినిమా తెలుగులో విడుద‌ల‌వుతుంది. మే 11న తెలుగు, త‌మిళ భాష‌ల్లో `కీ` చిత్రం విడులకు సిద్ధ‌మైంది.

టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుంది. కంప్యూట‌ర్‌ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ న‌ష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంత‌గా. అలాగే రీసెంట్ టైమ్స్‌లో బ్లూవేల్ గేమ్ వార్త‌ను మ‌నం త‌రుచూ చ‌దువుతూనే ఉన్నాం. ఈ బ్లూవేల్ గేమ్ ఆడి ఎంతో మంది యువ‌త బ‌ల‌వంతంగా త‌మ ప్రాణాల‌ను తామే తీసుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన బ్లూవేల్ గేమ్ కూడా ఈ సాంకేతిక‌త‌లో భాగంగానే ఉంది. కానీ ఇటువంటి బ్లూవేల్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌ను మ‌నం అంద‌రం ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే. మే 11వ‌ర‌కు ఆగాల్సిందే. ఎందుకంటే అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న`కీ` చిత్రాన్ని మే 11న విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇటీవ‌ల సుకుమార్ చేతుల మీదుగా విడులైన ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ద‌ర్శ‌కుడు క‌లీస్ సినిమాను సాంకేతికత‌లోని మ‌రో కోణాన్ని ట‌చ్ చేస్తూ కీ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు.