భారీ మొత్తానికి `కేజీఎఫ్ 2` డిజిట‌ల్ రైట్స్‌!

భారీ మొత్తానికి `కేజీఎఫ్ 2` డిజిట‌ల్ రైట్స్‌!
భారీ మొత్తానికి `కేజీఎఫ్ 2` డిజిట‌ల్ రైట్స్‌!

య‌ష్ న‌టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిందో అందిరికి తెలిసిందే. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డంతో ఈ చిత్ర సీక్వెల్  `కేజీఎఫ్ 2` పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ర‌వీనా టాండ‌న్ ప్రైమ్ మినిస్ట‌ర్ ర‌మికా సేన్‌గా, సంజ‌య్‌ద‌త్ అధీరాగా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని తెర‌కెక్కించారు. హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా షెడ్యూల్ ని వాయిదా వేశారు. వ‌న్స్ లాక్‌డౌన్ ఎత్తివేయ‌గానే ప‌రిస్థితుల‌ని బ‌ట్టి చివ‌రి షెడ్యూల్‌ని ప్రారంభిస్తార‌ట‌.

ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్ర డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్  భారీ మొత్తానికి సొంతం చేసుకున్న‌ట్టు తెలిసింది.