కేజీఎఫ్ 2 కి సర్వం సిద్ధం


KGF 2 shoot begins in march

సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ చాఫ్టర్ 1 కి సీక్వెల్ రంగం సిద్ధం అవుతోంది . కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్  చిత్రం గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించింది . ఒక్క కన్నడంలోనే కాకుండా తమిళ , తెలుగు , హిందీ బాషలలో రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . ఇక కన్నడంలో వంద కోట్ల సినిమా అన్నదే లేదు అలాంటిది కేజీఎఫ్ అక్కడ వంద కోట్లకు పైగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది .

 

ఇంతటి సంచలనం సృష్టించడంతో పార్ట్ 2 కి రంగం సిద్ధమైంది . మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . మొదటి పార్ట్ ప్రభంజనం సృష్టించడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అందుకు తగ్గట్లుగా రెండో పార్ట్ ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకులు ప్రశాంత్ నీల్ . కేజీఎఫ్ తో యష్ క్రేజ్  అమాంతం పెరిగింది .

 

English Title: KGF 2 shoot begins in march