హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న కేజిఎఫ్ 2


kgf chapter 2 completes hyderabad schedule
kgf chapter 2 completes hyderabad schedule

రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ యాక్షన్ చిత్రం కేజిఎఫ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనం అందరం చూసాం. కేవలం కన్నడలోనే కాక ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో కూడా సూపర్ హిట్ అయింది.

దాంతో కేజిఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోయాయి. ముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో షూటింగ్ చేద్దామనుకున్నా దాని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండడంతో షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.

హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ బెంగళూరులో త్వరలో మొదలవుతుంది.q

తొలి భాగాన్ని మించి యాక్షన్ సన్నివేశాలు ఉండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.