హైద‌రాబాద్‌లో రాఖీభాయ్ హంగామా!హైద‌రాబాద్‌లో రాఖీభాయ్ హంగామా!
హైద‌రాబాద్‌లో రాఖీభాయ్ హంగామా!

య‌ష్ న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సైలెంట్‌గా వ‌చ్చి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించింది. ఓవ‌ర్ నైట్‌లో హీరో య‌ష్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిల‌బెట్టింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రూపొందుతోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇందులో అధీరాగా బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్‌ద‌త్ న‌టిస్తున్నారు. లేడీ డైన‌మిక్ ప్ర‌దాని ర‌మికా సేన్ పాత్ర‌లో ర‌వీనా టాండ‌న్ క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే మేక‌ర్స్ రిలీజ్ చేసిన వీరి లుక్స్ సినిమా ఓ రేంజ్ వుండ‌బోతోంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. నిధిశెట్టి హీరోయిన్ న‌టిస్తున్న ఈ మూవీ ఫైన‌ల్ షెడ్యూల్ ఇటీవ‌లే మొద‌లైంది. ఈ వారం హైద‌రాబాద్‌లో రాఖీభాయ్ హంగామా చేయ‌బోతున్నారు. ఇక్క‌డే కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు.

దీంతో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంద‌ట‌. థియేట‌ర్స్ కూడా రి ఓపెన్ అవుతున్న నేప‌థ్యంలో అంతా అనుకున్నట్టుగా పూర్త‌యితే ఈ మూవీని సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 14న క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.