జ‌న‌వ‌రి 8న రాఖీభాయ్ స్పెష‌ల్ గిఫ్ట్‌!జ‌న‌వ‌రి 8న రాఖీభాయ్ స్పెష‌ల్ గిఫ్ట్‌!
జ‌న‌వ‌రి 8న రాఖీభాయ్ స్పెష‌ల్ గిఫ్ట్‌!

క‌న్న‌డ హీరో య‌ష్ న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. క‌న్న‌డ సినిమా అంటే దేశ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. హాలీవుడ్ స్థాయి చిత్రాల నిర్మాణం మాన‌కు కూడా సాధ్య‌మ‌ని `బాహుబ‌లి`తో రాజ‌మౌళి నిరూపిస్తే దాన్ని`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`తో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ మ‌రింత బ‌ల‌ప‌రిచాడు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కూడా వ‌సూళ్ల సునామీని సృష్టించింది.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రూపొందుతున్న విష‌యం తెలిసిందే. `బాహుబ‌లి ది బిగినింగ్` త‌ర‌హాలో ట్విస్ట్‌ల‌ని మిగిల్చి పార్ట్ 2 కోసం ప్రేక్ష‌కులు ఎదురుచూసేలా చేసిన చిత్ర‌న‌మిది. దీంతో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో క్రేజీ న‌టుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు.

ీ మూవీ చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్నారు. సంజ‌య్‌ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`లో క‌నిపించ‌బోతున్నారు. సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప‌క్కా ప్లాన్‌తో వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే జ‌న‌వ‌రి 8న హీరో య‌ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం స‌ర్ప్రైజ్ గిఫ్ట్‌ని రెడీ చేస్తోంద‌ట‌. ఆ రోజు `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్న‌ట్టు తెలిసింది.