యాభై రోజుల్లో 250 కోట్ల వసూళ్లు


KGF collects 250 crores in 50 days

కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్ల ని సాధించి చరిత్ర సృష్టించింది . ఓ కన్నడ సినిమా వంద కోట్ల వసూళ్ల ని రాబట్టడమే గగనం అలాంటిది ఏకంగా 250 కోట్ల వసూళ్లు అంటే ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాఫ్టర్ 1 చిత్రానికి మొదటి నుండి క్రేజ్ ఉంది దాంతో భారీ స్థాయిలో విడుదల చేసారు .

 

తెలుగు , తమిళ , కన్నడ,  హిందీ బాషలలో రిలీజ్ కాగా ఒక్క కన్నడంలోనే 150 కోట్ల మేర వసూళ్ల ని సాధించింది . అలాగే హిందీ , తెలుగు , తమిళ బాషలలో మరో వంద కోట్ల వసూళ్లు వచ్చాయి దాంతో 250 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసింది కేజీఎఫ్ . చాఫ్టర్ 1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమయ్యారు .

 

English Title: KGF collects 250 crores in 50 days