ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ మూవీ అదేనా?ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ మూవీ అదేనా?
ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ మూవీ అదేనా?

`కేజీఎఫ్`తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా చాప్ట‌ర్ 2ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. య‌ష్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ప్ర‌శాంత్ నీల్ తో `కేజీఎఫ్` మేక‌ర్స్ హంబ‌లే ఫిల్మ్స్ ఓ భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని అనౌన్స్ చేయ‌బోతున్నారు.

దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2:09 నిమిషాల‌కు రాబోతోంది. మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ మూవీ ప్ర‌భాస్‌తో వుంటుంద‌ని తాజాగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓ న్యూస్ బయ‌టికి వ‌చ్చేసింది. ప్ర‌భాస్‌తో పాన్ ఇండియా స్థాయిలో హంబ‌లే ఫిల్మ్స్ ఓ సినిమా చేయ‌బోతోంద‌ని, ఈ మూవీ క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఉగ్రం` ఆధారంగా తెర‌పైకి రానుంద‌ని. ఇదే అప్‌డేట్‌ని మేక‌ర్స్ బుధ‌వారం ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే `కేజీఎఫ్‌`తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఉగ్రం రీమేక్‌ని చేయ‌డ‌ని, కేజీఎఫ్‌కి మించిన క‌థ‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని మ‌రో ప‌క్క వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ 2న వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో తెర‌పైకి రానున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ని రివీల్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే బుధ‌వారం మ‌ధ్య‌హ్నం 2:09 నిమిషాల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.