ప్ర‌శాంత్ నీల్ స్టోరీ చెప్పేశాడు‌!kgf director Prashanth neel told story to ntr
kgf director Prashanth neel told story to ntr

`కేజీఎఫ్‌` చిత్రంతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప్ర‌శాంత్ నీల్ `కేజీఎఫ్‌`ను తెర‌కెక్కించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిప‌డింది. చాలా మంది నిర్మాత‌లు, క్రేజీ హీరోలు అత‌నితో  సినిమా చేయాల‌ని ఆస‌క్తిని చూపించ‌డం మొద‌లుపెట్టారు. ముందుగా ప్ర‌శాంత్ నీల్ కు భారీ మొత్తం అడ్వాన్స్ ని అందించి మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ ముందు వ‌రుస‌లో నిలిచింది. ఆయ‌న డేట్స్‌ని బ్లాక్ చేసింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఇటీవ‌లే ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్ర‌శాంత్ నీల్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేయ‌డంతో ఇద్ద‌రి క‌ల‌యిక‌లో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ రాబోతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. ఇటీవ‌లే ఎన్టీఆర్‌కు క‌థ వినిపించార‌ట‌.

పాయింట్ న‌చ్చ‌డంతో మ‌రోసారి ఈ ఇద్ద‌రు క‌లిసి స్టోరీపై చ‌ర్చించ‌నున్నార‌నని, ఒక సారి స్టోరీ ఫైన‌ల్ అయ్యాక ప్ర‌శాంత్ నీల్ స్క్రిప్ట్‌ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే ప‌నిలో నిమ‌గ్నం అవుతార‌ని చెబుతున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ చిత్రానికి బ‌ల్క్ డేట్స్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం కోసం మైత్రీ సంస్థ ఏకంగా 200 కోట్లు బ‌డ్జెట్‌ని కేటాయిస్తున్న‌ట్టు తెలిసింది.