ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ ప్ర‌క‌ట‌న రాబోతోందా?ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ ప్ర‌క‌ట‌న రాబోతోందా?
ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ ప్ర‌క‌ట‌న రాబోతోందా?

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. హీరో య‌ష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీతో సైత్‌లో రాజ‌మౌళి, శంక‌ర్‌ల త‌రువాత ఆ స్థాయి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పార్ట్ 2ని రూపొందిస్తున్న ప్ర‌శాంత్ నీల్ ఆ త‌రువాత తెలుగు స్టార్ హీరోతో పాన్ ఇండియాకి మించి ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌హేష్, ఎన్టీఆర్ ల‌తో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `కేజీఎఫ్‌` నిర్మాత విజ‌య్ కిరంగ‌దుర్ హంబ‌లే ‌ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ పాన్ ఇండియా స్థాయి మూవీని ప్ర‌భాస్‌తో చేయ‌బోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. డిసెంబ‌ర్ 2న మ‌ధ్యాహ్నం 2:9 నిమిషాల‌కు ఈ మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నామ‌ని మేక‌ర్స్ సోమ‌వారం ప్ర‌క‌టించారు.

కేజీఎఫ్ ని హాలీవుడ్ చిత్రాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో తెర‌కెక్కించి ఔరా అనిపించిన ప్ర‌శాంత్ నీల్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని అంత‌కు మించిన క‌థ‌తో తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. యాక్ష‌న్ డ్రామాగా తెర‌పైకిరానున్న ఈ మూవీ ఎలా వుంటుంది? ఎవ‌రితో వుంటుంది? ఇంత‌కీ క‌థేంటి అన్న‌ది డిసెంబ‌ర్ 2న స్ప‌ష్టం కాబోతోంది.