ప్రభాస్ ఆ హీరో రిక్వెస్ట్ ని ఒప్పుకుంటాడా ?Prabhas and Yash
Prabhas and Yash

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కన్నడ స్టార్ హీరో యష్ ఓ రిక్వెస్ట్ చేసాడట ! కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాదిన సంచలనం సృష్టించాడు ఈ యష్ . నిన్న మొన్నటి వరకు ఓ మాదిరి హీరోగా ఉన్న యష్ కేజీఎఫ్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు . అయితే కన్నడ స్టార్ హీరో ప్రభాస్ కు చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా ……. ఓ కన్నడ దర్శకుడు యాష్ కోసం భీభత్సమైన కథ రెడీ చేసుకొని చెప్పాడట !

అయితే ఆ కథలో ప్రభాస్ లాంటి అసలు సిసలైన స్టార్ హీరో అయితేనే బాగుంటుందని కథ విన్నాకా అనిపించిందట యష్ కు అందుకే ఈ సినిమా బాగుంటుంది కాకపోతే హీరోగా నేను చేసేకంటే ప్రభాస్ చేస్తే ఈ సినిమా రేంజ్ వేరుగా ఉంటుంది పైగా అందులో ఉన్న యాక్షన్ సీన్స్ కు అతడే కరెక్ట్ అని చెప్పడమే కాకుండా వెంటనే ప్రభాస్ కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసాడట . ఇక ప్రభాస్ కూడా కాస్త మొహమాటం పడే వ్యక్తి కాబట్టి తప్పకుండా అని మాట ఇచ్చాడట . అయితే ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా ? లేక లైట్ గా తీసుకుంటాడా అన్నది చూడాలి . ప్రస్తతం ప్రభాస్ సాహో తో బిజీ గా ఉన్నాడు . దాని తర్వాత జాన్ అనే చిత్రం కూడా చేస్తున్నాడు . మరి అది అయితే కానీ ఈ కన్నడ దర్శకుడి సినిమా సంగతి తేలదు .