ఒక్క సారి హిట్ పడితే ఇక ఎందుకు ఆగటం…మంచి దారి వెతుక్కుంటే చాలు


ఒక్క సారి హిట్ పడితే ఇక ఎందుకు ఆగటం...మంచి దారి వెతుక్కుంటే చాలు
ఒక్క సారి హిట్ పడితే ఇక ఎందుకు ఆగటం…మంచి దారి వెతుక్కుంటే చాలు

ఒక్క హిట్ సినిమా అందులో పని చేసే వారి దగ్గరనుండి వెనకాల ఉంది నడిపించిన వారికి సైతం తెగ ఉత్సహం పెరిగిపోతుంది. మరి ఒకవేళ సినిమా బాగాలేకపోతే? అందులో కూడా ఒక ఆనందం ఉంటుంది అది కేవలం కథా నాయకుల, నాయికల నటన గురించి మాత్రమే మాటాడుకుంటారు. వారికి ఇంకొక అవకాశం ఇస్తారు తర్వాత సినిమాలో…….

కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సినిమా మొదట ట్రైలర్ చూసి తెలుగు, తమిళ, మలయాళ నటులు ఇదేం సినిమా అనుకున్నారు. కారణం కన్నడ నుండి డబ్బింగ్ అవుతున్న సినిమా కాబట్టి. ఇక ఎప్పుడైతే విడుదల అయ్యి సినిమా విజయ డంకా మోగించిందో అప్పటి నుండి అందరూ చాప్టర్ 2 కోసం ఎదురు చూడ సాగరు. కథా నాయికగా నటించిన ‘శ్రీనిధి శెట్టి’ కి వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. అయినా కూడా ఆమె హడావిడిగా సినిమాలు  మొదలు పెట్టడం సులువు కాదు అనుకొని నెమ్మదిగా కథల ఎంపికల మీద ద్రుష్టి పెట్టింది.

ఇప్పుడు మొత్తం కె.జి.ఎఫ్. చాప్టర్ 2 మీదనే మొత్తం ఫోకస్ పెట్టిన శ్రీనిధి తర్వాత చేయబోయే సినిమాల గురించి మీడియా వారితో పంచుకోవడం లేదు. అందుకే ఆమె చేయబోయే సినిమాల గురించి ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు ఏకంగా చియాన్ విక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. విక్రమ్ -ఆర్.అజయ్ ఙ్ఞానముత్తు కలయికలో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథా నాయిక అయితే బాగుంటుంది అని నిర్మాతలు అయిన వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ అధినేతలు అనుకుంటున్నారు.

డిమోన్టి కాలనీ, అంజలి సి.బి.ఐ లాంటి సినిమాల విజయాల పరంపర కొనసాగించాలి అని ఆర్.అజయ్ జ్ఞానముతు ఈ సినిమాని బాగా తెరకెక్కించాలి అని నమ్మకంగా ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాలో విక్రమ్ గారు దాదాపు 25 గెట్ అప్ లో కనిపించబోతున్నారు అని అవి కథకి అనుకగుణంగా సాగుతాయి అని అంటున్నారు అజయ్. ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ చేయాలనీ భావిస్తున్నారు నిర్మాతలు. అలా అయితే శ్రీనిధి శెట్టి కి ఇక తెలుగులో కూడా మంచి మార్కెటింగ్ రావొచ్చు అని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు.

కె.జి.ఎఫ్ తర్వాత మొదటి సారి తమిళ ప్రేక్షకులకి అలాగే తెలుగు వారికీ దగ్గర అవ్వాలి అని చెప్పి శ్రీనిధి శెట్టి వేసుకున్న ప్లాన్ బాగుంది అని శ్రీనిధి శెట్టి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా విక్రమ్ – ఆర్.అజయ్ జ్ఞానముత్తు కలయికలో వస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకులు ఏ.ఆర్.రెహమాన్ గారు. ఇండియన్ క్రికెటర్ ‘ఇర్ఫాన్ పఠాన్’ కూడా సినిమాలో భాగస్వామ్యం అయ్యి మంచి పాత్ర చేయబోతున్నారు.