కేజిఎఫ్ 2 క్లైమాక్స్ : బాహుబలి2 కంటే భారీగా!


కేజిఎఫ్ 2 క్లైమాక్స్ : బాహుబలి2 కంటే భారీగా!
కేజిఎఫ్ 2 క్లైమాక్స్ : బాహుబలి2 కంటే భారీగా!

కేజిఎఫ్ చిత్రం విడుదలైనప్పుడు అదొక సంచలనం. కన్నడ సినిమాలపై నేషనల్ వైడ్ దృష్టి పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే కేజిఎఫ్ అనే సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ కావడం విశేషం. ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించింది. రాకీ భాయ్ గా యష్ నటన, టేకింగ్, డైలాగ్స్. సినిమాటోగ్రఫీ, గోల్డ్ మైన్స్ సెటప్ ఇలా అన్నీ చిత్రానికి ప్లస్ గా నిలిచాయి.

ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కన్నడతో పాటు అన్ని భాషల్లో హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. యష్ ఈ చిత్రం తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అంతకు మూడింతల పెట్టుబడి వెనక్కి తేవడం విశేషం.

ఇప్పుడు అదే ఊపుతో ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ సిద్ధమవుతోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదే ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాయి. ఒక్కసారి షూటింగ్ పూర్తయితే కానీ విడుదల తేదీ గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కేజిఎఫ్ 2 గురించి ఇప్పటికే చాలా వార్తలు ప్రేక్షకులను ఆసక్తి కలిగించాయి. రీసెంట్ గా ఈ సినిమాలో రవీనా టాండన్, రావు రమేష్ కూడా జాయిన్ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర క్లైమాక్స్ అత్యంత భారీగా ఉండబోతోందని సమాచారం. కేజిఎఫ్ 2 లో సంజయ్ దత్ అధీరా అనే పాత్రలో విలన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర క్లైమాక్స్ లో ఇద్దరి మధ్య ఫైట్ ఉండబోతోందని, ఇద్దరూ షర్ట్స్ విప్పి తమ సిక్స్ ప్యాక్స్ తో అబ్బురపరిచే విధంగా ఫైట్ ఉండబోతోందని అంటున్నారు. బాహుబలి2 లో కూడా ఈ తరహా ఫైట్ ఉండగా దానికంటే భిన్నంగా, భారీగా ఈ ఫైట్ ను డిజైన్ చేశారట. మరి కొద్ది రోజుల్లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుందని, దీంతో షూట్ ఎక్కువ శాతం పూర్తైపోతుందని అంటున్నారు. మరి కేజిఎఫ్ 2 ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.