గ్యాప్ లేకుండా సినిమాలు హీరో కిలాడికి మామూలే…


గ్యాప్ లేకుండా సినిమాలు హీరో కిలాడికి మామూలే...
గ్యాప్ లేకుండా సినిమాలు హీరో కిలాడికి మామూలే…

హీరో కిలాడి అంటే మన తెలుగు సినిమా హీరో కాదు. బాలీవుడ్ నటులు ‘అక్షయ్ కుమార్’ గారు…క్షణం తీరిక లేకుండా సంవత్సరానికి ఒక 4 సినిమాలు ఆడుతూ పాడుతూ చేసేస్తుంటాడు. ఆ సినిమా హిట్ ఆ? ఫ్లాప్ ఆ? అన్న విషయం అక్షయ్ కి మరియు సినిమా నిర్మాతలకి ఏ మాత్రం సంబందం ఉండదు. కారణం అక్కడ ఉన్నది అక్షయ్ కాబట్టి. అందుకే సినిమా విజయమా? విఫలమా? అన్నది జనాలు పట్టించుకోరు. ఇప్పుడు బాలీవుడ్ టాప్ స్టైలిష్ డైరెక్టర్ ‘రోహిత్ శెట్టి’ తో ‘సూర్యవంశీ’ అనే సినిమా చేస్తున్నాడు మన కిలాడి.

సినిమా ఎలా ఉండబోతుంది అంటే అది కూడా ముందే చెప్పేశారు దర్శకులు. ఇంతకీ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఆద్యాంతం పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మరియు సగటు ప్రేక్షకుడు కోరుకునే పలు విధాలుగా తీర్చిదిద్దుతున్నారు దర్శకులు రోహిత్ గారు. ఇది వరకటి రోహిత్ గారి సినిమాలు ‘సింగం’, ‘సింబా’ ఇప్పుడు ‘సూర్యవంశీ’ మూడు ఒకే పందాలొ సాగే సినిమాలు అని కొత్తగా విడుదల చెసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్దం అయిపోతుంది. ఇందులో అక్షయ్ కుమార్ తో పాటుగా అజయ్ దేవగన్, రణ్ వీర్ సింగ్ కూడా ఉన్నారు.

ఈ పోస్టర్ ని బట్టి చూస్తే సినిమాలోని ఒక పాటలో కానీ, భారీ సన్నివేశం జరిగేటప్పుడు మిగిలిన ఇద్దరు అలా అతిది పాత్రలో మెరవనున్నారు అని మనకి క్లూ వదిలారు దర్శకులు. సినిమాని హిరూ యశ్ జోహార్, అరుణ్ భాటియా, కరణ్ జోహార్, అపూర్వ మెహతా లాంటి పెద్ద దిగ్గజాలు అయిన నిర్మాతలు ఈ సినిమాని తమ సొంత నిర్మాణ సంస్థల మీద నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా అక్షయ్ కుమార్ గారికీ భార్యగా ‘కత్రినా కైఫ్’ నటిస్తున్నారు. హిమేష్ రేష్ మియా, తనిష్క్ బగచ్చి, గురు రంధావా సినిమాకి సంగీత దర్శకులు.

ఈ సినిమాని వచ్చే సంవత్సరం మార్చి 27 న విడుదల చేయడానికి సర్వం సిద్ధం అయినది అని నిర్మాతలు ఆ పోస్టర్ ని రిలీస్ చేశారు. రోహిత్ శెట్టి సినిమా కావడంతో అక్షయ్ కుమార్ కి తిరుగులేని హిట్ అందిస్తాడు అని కిలాడి అభిమానులు ఎదురుచూస్తున్నారు.