ఖుష్బూకు బెదిరింపు కాల్స్ !khushbu comment on west bengal cm mamata benaji
khushbu comment on west bengal cm mamata benaji

ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల‌కు బెరిదింపు కాల్స్ రోజు రోజుకీ ఎక్కువ‌వుతున్నాయి. చంపేస్తామ‌ని, లేదా రేప్ చేస్తామ‌ని ఆక‌తాయిలు బెరిదింపుల‌కు దిగుతున్నారు. తాజాగా త‌మిళ న‌టుడు, హీరో శ‌ర‌త్‌కుమార్‌ని చంపేస్తామంటూ ఆక‌తాయిలు బెదిరింపు కాల్స్ చేసిన విష‌యం తెలిసిందే. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు ఇంటి అవ‌ర‌ణ‌లోకి అక‌స్మాత్తుగా చొచ్చుకొచ్చిన ఆగంత‌కులు మంచు వారిని చంపేస్తామంటూ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఇలాంటి ఓ బెదిరింపే న‌టి, కాంగ్రెస్ నేత ఖుష్బూకు ఎదురు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఓ ఆక‌తాయి ఫోన్ చేసి రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నాడ‌ట‌. ఇదే విష‌యాన్ని ఖుష్బూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. అంతే కాదు త‌న‌ని రేప్ చేస్తానంటూ స్వ‌యంగా ఫోన్ చేసి బెదిరించిన వ్య‌క్తి వివ‌రాల‌ని కూడా సోష‌ల్ మీడియా వేద‌క‌గా వెల్ల‌డించిన ఖుష్బూ ఓ నంబ‌ర్‌ని కూడా షేర్ చేస్తూ కోల్ క‌తా పోలీసుల‌ని కోరింది.

కోల్ క‌తాకు చెందిన సంజ‌య్ శ‌ర్మ అనే వ్య‌క్తి పేరుని ట్రూకాల‌ర్‌లో చూపిస్తోంద‌ని, అది కోల్‌క‌తా నుంచి వ‌చ్చింద‌ని కోల్‌క‌తా పోలీసులు వెంట‌నే అత‌నిపై చ‌ర్య తీసుకోవాల‌ని కోరింది. త‌న ప‌రిస్థితే ఇలా వుంటే ఇక సామాన్య మ‌హిళ‌ల ప‌రిస్థితేంట‌ని, వెంట‌నే స్పందించండ‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కోరింది.