మ‌హేష్ హీరోయిన్ 2 కోట్లు డిమాండ్ చేస్తోంది!


మ‌హేష్ హీరోయిన్ 2 కోట్లు డిమాండ్ చేస్తోంది!
మ‌హేష్ హీరోయిన్ 2 కోట్లు డిమాండ్ చేస్తోంది!

హిందీలో `ల‌స్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్‌తో కియారా అద్వానీ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సిరీస్ త‌రువాత ఆమెతో సినిమాలు నిర్మించాలని బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పోటీప‌డ్డారు. ఈ క్ర‌మంలో తెలుగులో ఆమెకు తొలి ఆఫ‌ర్ ల‌భించింది. మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది కియారా అద్వానీ. ఈ సినిమా సూప‌ర్‌హిట్ కావ‌డంతో వెంట‌నే తెలుగులో మ‌రో ఆవ‌కాశం ఆమెని వ‌రించింది.

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించిన చిత్రం `విన‌య విధేయ రామ‌`. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించింది. సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో కియారా తెలుగు మార్కెట్ ప‌డిపోయిన‌ట్టేన‌ని అంతా భావించారు కానీ ఆమెపై `విన‌య విధేయ రామ‌` ఫ్లాప్ ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. తాజాగా కియారాకు తెలుగులో మ‌రో భారీ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌పైకి రాబోతోంది.

ఈ చిత్రం కోసం కియారాని చిత్ర బృందం సంప్ర‌దించార‌ట‌. రెండు కోట్లు పారితోషికం అయితేనే చేస్తాన‌ని కియారా క‌రాఖండీగా చెప్పిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. `అర్జున్‌రెడ్డి` బాలీవుడ్ రీమేక్ `క‌బీర్‌సింగ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో కియారా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో త‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే రెమ్యున‌రేష‌న్‌ని కియారా డిమాండ్ చేస్తోంది.