పదో తరగతిలోనే ప్రేమించానంటున్న లస్ట్ భామ


Kiara advani
Kiara advani

మా అమ్మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటానంటోంది లస్ట్ భామ కియారా అద్వానీ . లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ఈ భామ తెలుగులో మహేష్ బాబు , రాంచరణ్ ల సరసన నటించిన విషయం తెలిసిందే . ధోని బయోపిక్ ద్వారా స్టార్ అయిన ఈ భామ తాజాగా కబీర్ సింగ్ లో నటించి మరింతగా రెచ్చగొడుతోంది కుర్రాళ్ళని .

ఇక ప్రేమ విషయానికి వస్తే ……. మా అమ్మా నాన్న లది ప్రేమ వివాహమే ! వాళ్లిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అందుకే నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను , కాకపోతే అది ఎప్పుడో తెలీదు , ఎవరిని అన్నది కూడా తెలియదు అంటోంది . అంతేనా …….. పదో తరగతి లో ఉన్నప్పుడే ఓ కుర్రాణ్ణి ప్రేమించిందట అయితే అది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే అని తర్వాత తెలిసిందట . ఇక ఆ కుర్రాణ్ణి ఇష్టపడుతున్న విషయం తల్లికి తెలియడంతో ముందు చదువు తర్వాత ప్రేమ అని హెచ్చరించిందట దాంతో చదువు దృష్టి పెట్టానని అంటోంది కియారా అద్వానీ .