కైరా అద్వానీ ఆ హీరోని ప్రేమిస్తోందా ?


kiara advani in love with siddarth malhotraభరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన నటించిన భామ కైరా అద్వానీ తాజాగా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమలో పడినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయ్ దానికి తోడు కైరా అద్వానీ పుట్టినరోజు వేడుకలకు సిద్దార్థ్ మల్హోత్రా హాజరుకావడంతో ఈ గుసగుసలకు మరింత ఊపొచ్చింది . బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ కు మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ తో ఒక్కసారిగా స్టార్ అయిపొయింది . ఇక తెలుగులో కూడా అవకాశాలు విచ్చలవిడిగా వచ్చి పడుతున్నాయి .

మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో ఈ భామ నటించగా తాజాగా రాంచరణ్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది . ఇక ప్రేమ విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు భామలను మార్చాడు సిద్దార్థ్ మల్హోత్రా అయినప్పటికీ కైరా అద్వానీని పట్టేసాడు . అలియా భట్ తో డీప్ లవ్ సాగించిన సిద్దార్థ్ ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పి మరో ఇద్దరు ముగ్గురు తో రొమాన్స్ చేసాడు ఇక ఇప్పుడేమో కైరా అద్వానీ తో రొమాన్స్ చేస్తున్నాడు . కైరా కూడా సిద్దార్థ్ మాయలో పడిందని అంటున్నారు .

English Title: kiara advani in love with siddarth malhotra