కియారా అద్వానీను వదల బొమ్మాళీ వదల అంటున్నారే!kiara advani offers in Bollywood and Tollywood
kiara advani offers in Bollywood and Tollywood

బాలీవుడ్ నటి కియారా అద్వానీ టైమ్ ఇప్పుడు ఒక రేంజ్ లో నడుస్తోంది. వరస సూపర్ హిట్లతో కియారా రేంజ్ పూర్తిగా మారిపోయింది. కబీర్ సింగ్, గుడ్ న్యూజ్ విజయాల తర్వాత కియారా వెంట దర్శకులు, నిర్మాతలు  క్యూ కడుతున్నారు. కియారా నటించిన లక్ష్మి బాంబ్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే షేర్షా, భూల్ భులాయా 2 షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వరుణ్ ధావన్ హీరోగా గుడ్ న్యూజ్ దర్శకుడు నటించే చిత్రంలో కియారా హీరోయిన్ గా ఎంపికైంది.

టాలీవుడ్ కూడా కియారా అద్వానీ అంటే క్రేజ్ చూపిస్తోంది. మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది కియారా. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత నుండి కియారాను మళ్ళీ టాలీవుడ్ లో నటింపజేయాలని విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ తాజాగా నటించనున్న సర్కారు వారి పాటలో ముందుగా కియారాను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే బిజీ కారణంగా ఆమె ఎస్ చెప్పలేకపోయింది. ఇక రామ్ చరణ్ సరసన ఆచార్యలో చిన్న రోల్ కోసం సంప్రదిస్తున్నారు. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదామె.