కియారా పదో తరగతిలోనే ప్రేమలో పడిందట


Kiara advani
Kiara advani

కియారా అద్వానీ పదో తరగతి లోనే పీకల్లోతు ప్రేమలో పడిందట ! అంతేనా ప్రేమికుడితో ఏకంగా ఫోన్ లో మాట్లాడుతూ తల్లికి అడ్డంగా దొరికిపోయిందట .

దాంతో కియారా తల్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట అంతేకాదు ఇకపై అబ్బాయిలతో మాట్లాడితే సహించేది లేదని బుద్దిగా చదువుకోమని సలహా ఇచ్చిందట ! ప్రియుడ్ని మర్చిపోవడానికి చాలా సమయం పట్టిందట ! అయితే ఎట్టకేలకు ప్రేమికుడ్ని మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టానని తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పింది .

తాజాగా ఈ భామ హిందీలో నటించిన చిత్రం ” కబీర్ సింగ్ ” . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు .

ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి రివ్యూస్ అంతగా బాగో రాలేదు కానీ వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి . పదో తరగతిలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను మాత్రమే ప్రేమిస్తున్నాను అని కొంటె సమాధానం ఇస్తోంది కియారా అద్వానీ .