పెళ్ళికి ముందే సెక్స్ చేస్తే తప్పు కాదు : కైరా అద్వానీ


kiara advani sensational comments on sexపెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొంటే అందులో తప్పేం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన కైరా అద్వానీ . నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శృంగారం గురించి మాట్లాడుకునే వాళ్లమని అయితే పెళ్ళికి శృంగారం లో పాల్గోనడం తప్పు అని అనుకునే వాళ్ళమని , ఆ తతంగమంతా పెళ్లి తర్వాతే చేసుకోవాలని చర్చకు వచ్చేదని కానీ సినిమాల్లోకి వచ్చాక అర్ధమయ్యింది శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని అది వాళ్ళ వాళ్ళ ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేసింది కైరా అద్వానీ .

బాలీవుడ్ లో ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఎం ఎస్ ధోని బయోపిక్ చిత్రం తోనే ఈ భామకు బాగా గుర్తింపు వచ్చింది . ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు చిత్రాల్లో నటించింది . ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన వెంటనే నటించే చాన్స్ వచ్చింది , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తతం చరణ్ సరసన నటిస్తోంది . అయితే ఇటీవల ఓ శృంగారాత్మక చిత్రమైన ” లస్ట్ స్టోరీస్ ” లో చాలా బోల్డ్ గా నటించింది . దాంతో శృంగారం పై బాగానే మాట్లాడుతోంది . ఏ మగాడి దగ్గరైతే మంచి సువాసన వస్తుందో అలాంటి మగాడు అంటే నాకు చాలా చాలా ఇష్టం అని అంటోంది అంతేకాదు పెళ్లి కి ముందే శృంగారంలో పాల్గొంటే తప్పు లేదని డంకా బజాయించి మరీ చెబుతోంది కైరా అద్వానీ .

English Title : kiara advani sensational comments on sex